నా ఫ్యామిలీ సేఫ్ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ నటుడు

Published on Mar 31, 2020 10:24 am IST

కోవిడ్ 19 కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతోంది. సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి స్వదేశాలకు తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే విదేశీ పర్యటన నుండి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ ఒకరికి కరోనా సోకగా ప్రముఖ నటుడు, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న అజయ్ దేవగన్ కుటుంబానికి సైతం కరోనా సోకినట్టు వార్తలు గుప్పుమన్నాయి.

అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నిశా సింగపూర్లో చదువుకుంటోంది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను కాజోల్ స్వయంగా సింగపూర్ వెళ్ళి ముంబై తీసుకొచ్చారు. దీంతో వారికి కరోనా ఎఫెక్ట్ అయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిపై స్పందించిన అజయ్ దేవగన్ కాజోల్, నిశా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు. ఇకపోతే కాజోల్, నిశా ఇద్దరూ వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More