‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 15, 2019 2:30 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఎన్టీఆర్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్ కు బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తాయట. బ్రిటిష్ సైనికులు భారతీయుల పై చేసే దాడులకి ప్రతీకారంగా ఎన్టీఆర్ వారిని అంతం చేసే క్రమంలో ఈ సన్నివేశాలు వస్తాయని సమాచారం.

ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More