‘అర్ఆర్ఆర్’ ఖాతాలో మరో రికార్డ్ పడినట్టేనా?

Published on Jul 27, 2021 12:00 am IST

రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం తాజాగా మరో రికార్డ్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఆడియో హక్కులను లహరి మ్యూజిక్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో పూర్తి రైట్స్‌ని ఈ సంస్థలు దక్కించుకున్నాయి.

అయితే ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఈ సంస్థలు ఏకంగా రూ.25 కోట్లు వెచ్చించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఆడియో హక్కులకు ఇంత మొత్తంలో ధర పలికిన సినిమాగా దేశంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు తెలుస్తుంది. గతంలో లహరి మ్యూజిక్‌ సంస్థ కేజీయఫ్‌-2 సినిమా ఆడియో హక్కులను సుమారు రూ.7.2కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి.

సంబంధిత సమాచారం :