నేపాల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్

Published on Mar 30, 2022 9:10 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ నోట్ తో ప్రారంభమైన చిత్రం. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పుడు, ఈ చిత్రం నేపాల్ లో విడుదలైన మొదటి రోజు నుండి నిరంతరాయంగా కోటి రూపాయలను వసూలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 7 కోట్ల నేపాల్ రూపీస్ అని ట్రేడ్ వెల్లడించింది.

ఇండియాలో కూడా ఈ సినిమా నార్త్ ఇండియాలోని మాస్ బెల్ట్‌లలో భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీలో RRR 100 కోట్లు దాటింది మరియు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఈ చిత్రం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు.

సంబంధిత సమాచారం :