జక్కన్న “RRR” ఫస్ట్ వీక్ భారీ వసూళ్లు!

జక్కన్న “RRR” ఫస్ట్ వీక్ భారీ వసూళ్లు!

Published on Apr 1, 2022 6:00 PM IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో సిసలైన నటన కనబరిచారు. ఈ చిత్రం లో వీరి నటన కి ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి జక్కన్న తన చిత్రం తో మ్యాజిక్ చేయగా, ఎంఎం కీరవాణి సంగీతం విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 710 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టింది. అయితే వీకెండ్ తో పాటుగా వచ్చే వారానికి ఈ చిత్రం అద్భుతాలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు