“RRR” షూట్ రూట్ లో తమ సాంగ్ కే ఎంజాయ్.!

“RRR” షూట్ రూట్ లో తమ సాంగ్ కే ఎంజాయ్.!

Published on Aug 11, 2021 3:00 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాలన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎనలేని క్రేజ్ నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఇటీవల ఫ్రెండ్షిప్ డే సాంగ్ “దోస్తీ” వచ్చి చాలా పెద్ద హిట్టయ్యింది. మరి ఈ సాంగ్ కే ఈ సినిమా ఇద్దరు హీరోలు కూడా ఉక్రెయిన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు.

మొన్ననే మేకర్స్ ఇక నుంచి ఈ చిత్రం ఇన్స్టాగ్రామ్ ను తారక్ కొన్నాళ్ళు హ్యాండిల్ చేస్తాడని చెప్పి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అలా ఈ కొత్త వీడియో వచ్చింది. తారక్ మరియు చరణ్ లు కార్ లో వెళ్తూ తమ సాంగ్ నే వింటూ సినిమా షూటింగ్ కి బయల్దేరుతున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ కొత్త వీడియో వైరల్ అవుతుంది. మరి ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవ్ గన్ తదితరులు నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహిస్తున్నారు.

https://www.instagram.com/p/CSbF0oXDQ4r/?utm_medium=share_sheet

సంబంధిత సమాచారం

తాజా వార్తలు