ఎన్టీఆర్ చేతిలోకి “ఆర్ఆర్ఆర్” మూవీ ఇన్ స్టాగ్రం అకౌంట్..!

Published on Aug 8, 2021 7:21 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కోమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఒలివియా మోరిస్, అలియా భట్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్ సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పలు అప్డేట్స్ ను సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మూవీ అకౌంట్ ద్వారా వెల్లడించడం జరుగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇన్ స్టాగ్రం అకౌంట్ ను జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ 9 వ తేదీ నుండి స్వాధీనం చేసుకోనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ అదే హ్యాండిల్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే పలు అప్డేట్స్ ను ఇస్తూ అభిమానులను అలరిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అకౌంట్ ఎన్టీఆర్ చేతిలోకి పోవడం తో, ఎన్టీఆర్ ఎలా దాన్ని ఉపయోగించనున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :