జపాన్లో ‘RRR’ ఫైనల్ వసూళ్లు ఎంతో తెలుసా?

జపాన్లో ‘RRR’ ఫైనల్ వసూళ్లు ఎంతో తెలుసా?

Published on Apr 18, 2025 3:01 PM IST

RRR i japan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వచ్చిన ప్రైడ్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం వసూళ్ళని మించి ఎంతో గుర్తింపు తెలుగు సినిమా సహా భారతీయ సినిమాకి తీసుకొచ్చింది.

అయితే ఈ సినిమా మన దగ్గర కంటే అతి పెద్ద హిట్ గా జపాన్ దేశంలో రన్ అయ్యింది. మన దగ్గర సుమారు 100 రోజులు అది కూడా కొన్ని సెంటర్స్ లోనే ఆడింది కానీ జపాన్ లో మాత్రం ఏకంగా 365 రోజులకి పైగా ఈ చిత్రం ఈజీగా రన్ అయ్యింది. మధ్యలో కొన్ని కొన్ని రోజులు అయితే రిలీజ్ రోజు కంటే వసూళ్లు ఎక్కువ వచ్చాయి.

ఇలా పలు హాలీవుడ్ సినిమాలని సైతం క్రాస్ చేసి RRR రికార్డు వసూళ్లు అందుకుంది. అయితే అసలు RRR ఓవరాల్ గా ఎంత రాబట్టిందో ఇపుడు తెలుస్తుంది. ఈ చిత్రం అక్కడ 2.5 బిలియన్ జపాన్ యిన్స్ ని రాబట్టిందట. అంటే మన మారక ద్రవ్యంతో చూసుకున్నట్టయితే సుమారు 150 కోట్ల గ్రాస్ ని జపాన్ లో RRR అందుకొని సెన్సేషన్ సెట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు