“ఆర్ఆర్ఆర్” మూవీ నుండి డైలాగ్ ప్రోమో విడుదల కి సిద్దం గా ఉందా?

Published on Aug 16, 2021 11:30 pm IST

టాలీవుడ్ నుండి విడుదల అవుతున్న చిత్రాల్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒకటి అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమా గా ఐదు బాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను వినూత్నంగా చేసేందుకు సిద్దం అయ్యారు దర్శకులు రాజమౌళి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ కార్యక్రమం కూడా భారీ స్థాయిలో చేసే అవకాశం లేకపోవడం తో వినూత్న రీతిలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దోస్తీ పాట తో అలరించిన టీమ్ ప్రస్తుతం డైలాగ్ ప్రోమో తో సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :