ఓవర్సీస్ లో “RRR” మ్యానియా..అప్పుడే రికార్డు ఫిగర్ క్రాస్.!

Published on Mar 8, 2022 8:14 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ చెయ్యనుండగా ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కాగా మరింత స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

గత డిసెంబర్ లో కంటే ఈసారి అధికంగా, వేగంగా బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా రికార్డు ఫిగర్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ప్రీమియర్స్ మరియు ప్రీ సేల్స్ కలిపి 1 మిలియన్ డాలర్స్ ని ఈ సినిమా ఇప్పటికే దాటేసిందట. ఇక సినిమా రిలీజ్ నాటికి ఈ సినిమా హవా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :