వరల్డ్ వైడ్ ఇంకా తగ్గని “RRR” సినిమా హవా..!

వరల్డ్ వైడ్ ఇంకా తగ్గని “RRR” సినిమా హవా..!

Published on Aug 18, 2022 7:02 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గానే ఇండియన్ టెలివిజన్ దగ్గర టెలికాస్ట్ కి కూడా వచ్చింది.

అయితే దీనికన్నా ముందే ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యి ఎలాంటి ఆదరణ ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ నుంచి అందుకుంటుందో చూస్తూనే ఉన్నాము. ఇక ఈ హవా అయితే ఇన్ని నెలలు అవుతున్నా కూడా అసలు తగ్గేలా కనిపించడం లేదు. రీసెంట్ గానే మరింతమంది హాలీవుడ్ సహా పలు దేశాల ప్రముఖులు, రిపోర్టర్లు సినిమా చూసి తమ స్పందనను తెలియజేస్తున్నారు. దీనితో అయితే ఈ సినిమా హవా మాత్రం అసలు తగ్గడం లేదని చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు