“రైజ్ ఆఫ్ రామ్” రిలీజ్… వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ..!

Published on Dec 31, 2021 10:02 pm IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ కొమురం భీముడో సాంగ్ రిలీజై సంచలనం సృష్టించగా, తాజాగా రామ్ చరణ్ ‘రైజ్ ఆఫ్‌ రామ్‌’ సాంగ్ విడుదలయ్యింది.

అయితే రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌ను తెలియచేస్తూ ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయగా, విజయ్ ప్రకాశ్‌, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ పాడారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇండియన్ క్లాసిక్, వెస్ట్రన్ ఫ్యూజన్‌తో సాగిన ఈ పాట అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :