తారక్ కి తగిలింది దెబ్బ కాదు..”RRR” టీం క్లారిటీ.!

Published on Aug 8, 2021 9:43 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో జక్కన్న రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి అలాగే ఈ చిత్రం ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో పలు కీలక సన్నివేశాలు సహా పాట చిత్రీకరణ నిమిత్తం వెళ్లి బిజీగా ఉంది.

అయితే ఈ షూట్ గ్యాప్ లో చరణ్, తారక్ మరియు రాజమౌళిలు షూట్ గ్యాప్ లో చిల్ అవుతున్న ఫన్నీ వీడియోని వదిలారు. అయితే ఇందులో తారక్ కి దెబ్బ తగిలి ఉన్నట్టుగా తల దగ్గర గాటు కనిపించింది. దీనితో తారక్ అభిమానులు సహా మోవి లవర్స్ కంగారు పడ్డారు..

అలాగే “RRR” యూనిట్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ ఉంటారన్న సంగతి తెలిసిందే.. అలా ఉండబట్టే దాని మీద క్లారిటీ వచ్చింది. అది ఎలాంటి దెబ్బ కాదు అని జస్ట్ మేకప్ అని క్లారిటీ ఇస్తే కానీ కొంతమంది తారక్ అభిమానులకు హార్ట్ బీట్ తగ్గలేదు.. ఇప్పుడు ఈ రిప్లై నే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :