ఆర్ ఆర్ ఆర్ మూవీ కి వేరే లెవెల్ లో ప్రమోషన్స్!

Published on Jul 12, 2021 12:03 am IST


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, గోండు బెబ్బులీ కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కి ఇంకా సమయం ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేయనుంది. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన రామరాజు ఫర్ భీమ్ మరియు రామ్ చరణ్ కి సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ లు విడుదల అయ్యాయి.

అంతేకాక అజయ్ దేవగణ్ లాంటి బాలివుడ్ టాప్ హీరో వీడియో సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలియా భట్ మరియు మరొక హీరోయిన్ పాత్ర పోషిస్తున్న ఒలివియా మోరిస్ పాత్రలకు సంబంధించిన పోస్టర్ లను సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఆర్ ఆర్ ఆర్ ఫర్ రోర్ అంటూ మరొక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల కి సిద్దం చేసింది. అయితే ఈ వీడియో ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం గా ఉంది. కొత్త సినిమాలు విడుదల అయ్యే సమయం లో ఈ వీడియో ను వేసి ప్రమోట్ చేసే ఆలోచనలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్ తో భారీ తారాగణం ఉండటం తో ఈ చిత్రం కోసం యావత్ భారత దేశం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తుంది అని చెప్పాలి. జక్కన్న రాజమౌళి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో తన దైన శైలిలో ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :