“RRR” ఖాతాలో అరుదైన ఘనత..యూఎస్ లో నెం1 చిత్రంగా ర్యాంక్.!

“RRR” ఖాతాలో అరుదైన ఘనత..యూఎస్ లో నెం1 చిత్రంగా ర్యాంక్.!

Published on Jun 17, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూస్తున్నాము. థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం ఓటిటి లో వచ్చి గ్లోబల్ గా సెన్సేషనల్ రీచ్ ని దక్కించుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియెన్స్ లో అనేక దేశాల్లో ఈ చిత్రమే హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇలా ఎన్ని రేర్ ఫీట్స్ సెట్ చేస్తూ వెళ్తున్న ఈ చిత్రం యూఎస్ లో ఓ అరుదైన ఘనతను అందుకుంది. అక్కడి అతి పెద్ద పబ్లిషన్స్ అయినటువంటి యూఎస్ఏ టుడే వారు ఈ ఏడాదికి రిలీజ్ అయ్యిన అన్ని చిత్రాల్లో RRR చిత్రాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రచురించారు. ఈ లిస్ట్ లో పలు హాలీవుడ్ భారీ చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మించి ఈ చిత్రాన్ని నెంబర్ 1 సినిమాగా వారు కొనియాడారు. దీనితో ఈ ప్రౌడ్ మూమెంట్ ని ఎంతో గర్వంగా చిత్ర యూనిట్ షేర్ చేసి థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు