అద్భుత లొకేషన్స్ లో “RRR” నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్!

Published on Dec 3, 2020 7:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ అండ్ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం తాలుకా షూట్ లాక్ డౌన్ అనంతరం శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ తాము చెయ్యబోయే కొత్త షెడ్యూల్ కు సంబంధించి కూడా అప్డేట్ ఇస్తామన్నారు. అలా అన్నట్టుగానే ఎక్కడ షూట్ చేస్తున్నారో కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మహాబలేశ్వర్ కు బయలుదేరి అక్కడ అద్భుతమైన లొకేషన్స్ లో ఈ కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశామని తెలిపారు.

అంతే కాకుండా ఇదే షూట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా పాల్గొననున్నట్టుగా తెలిపారు. అయితే ఈ షెడ్యూల్ కాస్త చిన్నదే అని చెప్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More