మీరు ఊహిస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ లో అది ఉండదు..!

మీరు ఊహిస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ లో అది ఉండదు..!

Published on Apr 23, 2020 3:34 PM IST

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రల ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కథా కథనాలపై అనేక ఊహాగానాలు, అనుమానాలు, పుకార్లు ఉన్నాయి. ఐతే రాజమౌళి ఇది ఊహాజనితమైన కథ మాత్రమే, చరిత్ర ఆధారంగా తెరకెక్కించినది కాదని తెలియజేడం జరిగింది. ఇక చరణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన చరణ్ ఫస్ట్ లుక్ వీడియోతో అనుమానాలు తార స్థాయికి చేరాయి.

చరణ్ ని పోలీసుగా పరిచయం చేసి, ఆర్ ఆర్ ఆర్ కథ అసలు చరిత్రకు పొంతన లేకుండా సాగుతుందని తెలియజేశాడు. ఈ చిత్రంలో ఒకప్పటి ఇద్దరు ఉద్యమ వీరులు ఉండడంతో ఈ మూవీ దేశభక్తి వంటి భావాజాలం ఉంటుందని భావిస్తే అది పొరపాటే అని రాజమౌళి చెవుతున్నారు. ఈ మూవీ దేశభక్తి కోణంలో తెరకెక్కిన సినిమా కాదని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఇక మే 20న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తే ఈ మూవీపై కొంత స్పష్టత రావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు