పోస్టర్‌తోనే రికార్డ్ సెట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్..!

Published on Jul 3, 2021 3:00 am IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఋఋఋ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అయితే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా ఎన్‌టీఆర్ ఖాతాలోకి మరో రికార్డ్ వచ్చి చేరింది. సినిమా రిలీక్ కాకుండానే ఇప్పటికే పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న ఎన్‌టీఆర్ తన పోస్టర్‌తో ఓ మెస్మరైజ్ రికార్డ్ సెట్ చేసేశాడు. 2020 సంవత్సరం మే నెలలో కొమరం భీమ్ పోస్టర్ రిలీజ్ కాగా ట్విట్టర్‌లో ఈ పోస్టర్‌కు ఎక్కువ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు హీరో పోస్టర్‌కు కూడా ట్విట్టర్‌లో 2 లక్షల కామెంట్లు రాలేదు. దీంతో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :