“RRR’ ఆన్ టైం రిలీజ్ వీటిపైనే ఆధార పడుందా.?

“RRR’ ఆన్ టైం రిలీజ్ వీటిపైనే ఆధార పడుందా.?

Published on May 2, 2021 6:32 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అయితే మళ్లీ కోవిడ్ పెరుగుతుంటే ప్రశ్నార్ధకంగా మారిన పలు చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా చేరింది. ఆల్రెడీ ప్రకటించిన సినిమా డేట్ ను అవాయిడ్ చేస్తూ వస్తున్న మేకర్స్ ముఖ్యంగా రెండు చోట్ల పరిస్థితుల దిద్దుబాటు కోసం చూస్తున్నారట.

మొదటగా మన దగ్గర ఎంతో కీలకమైన హిందీ మార్కెట్ లో అలాగే మరొకటి ఓవర్సీస్ లో.. ఈ రెండు చోట్లా రాబోయే రోజుల్లో ఉండే పరిస్థితి ఆధారంగా అనుకున్న టైం కి అంటే అక్టోబర్ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అన్నది తెలుస్తుందట. ఒకవేళ కానీ అలా జరక్కుంటే ఇక వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసేయడమే..మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు