‘ఆర్ ఆర్ ఆర్’ ఓవర్సీస్ రేటు వింటే షాక్ అవ్వాల్సిందే…!

Published on Jun 13, 2019 11:54 pm IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. టాలీవుడ్ సూపర్ స్టార్స్ఐన తారక్, చరణ్ లు హీరోలుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతుంది.ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం కర్మాగారంలో వేసిన భారీ సెట్ లో తారక్, చరణ్ లపై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. తాజా గా ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల ధర విషయమై టాలీవుడ్ లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే దుబాయ్ కి చెందిన ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ను భారీ ధర చెల్లించి కొనుక్కున్నారట.

చైనాలో మినహా మిగతా అన్ని దేశాల్లో అన్ని భాషల రైట్స్ ను ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. ఒక్క ఓవర్సీస్ హక్కులనే 65 కోట్లకు అమ్మితే తెలుగు,హిందీ,తమిళ భాషల హక్కులతో పాటు శాటిలైట్ రైట్స్ ఇలా మొత్తం కలుపుకొని “ఆర్ ఆర్ ఆర్” ఎంత బిజినెస్ చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :

More