భీం తుఫానుకు ముహూర్తం ఖరారు చేసిన “RRR” టీం.!

Published on Oct 20, 2020 11:13 am IST

మాటల్లో వర్ణించ లేని విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇండియన్ మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “RRR” నుంచి రానున్న మాస్ ఫీస్ట్ తారక్ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తారక్ వస్తున్నందున తారాస్థాయి అంచనాలను పెట్టుకున్నారు.

అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కొమరం భీం ఎన్టీఆర్ అప్పుడు గిఫ్ట్ ఇవ్వగా ఇప్పుడు రామరాజు ఇవ్వనున్న గిఫ్ట్ మోస్ట్ అవైటెడ్ గా మారింది. తుఫాను లాంటి రికార్డులను సృష్టించాలని గట్టిగా ఫిక్స్ అయిన తారక్ అభిమానులకు ఇపుడు RRR చిత్ర యూనిట్ అందుకు ముహుర్తాన్ని ఖరారు చేసేసారు.

వచ్చే అక్టోబర్ 22 న ఉదయం 11 గంటలకు తారక్ భీం టీజర్ ను మొత్తం ఐదు భాషల్లోనూ రామరాజు టీజర్ విడుదల చేసినట్టుగానే విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసేసారు. సో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సమయం ముందే లాక్ చేసుకున్నట్టయ్యింది. మరి తారక్ ఫ్యాన్స్ ఈ టీజర్ తో ఎలాంటి రికార్డుల సునామి సృష్టిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More