పాటలకు వేళాయెరా అంటున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్..!

పాటలకు వేళాయెరా అంటున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్..!

Published on Nov 23, 2019 1:06 PM IST

rrr

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయువేగంతో పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో డే అండ్ నైట్ షూట్ నిర్వహిస్తున్నారని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ కావడంతో చిత్రీకరణ అనంతరం కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కొరకు నెలల సమయం పడుతుంది. అందుకే ఆయన త్వరపడుతున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ డెబ్భై శాతం వరకు పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

కాగా జక్కన్న ఎన్టీఆర్ కి హీరోయిన్ కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో పాటల చిత్రీకణ కూడా మొదలుపెట్టనున్నారట. ఆర్ఆర్ఆర్ లో కొన్ని సాంగ్స్ నేపథ్యంలో నడిచేవి వుండగా, హీరోహీరోయిన్స్ పై వచ్చే రొమాంటిక్ సాంగ్స్ రాజమౌళి మొదట చిత్రీకరించాలని భావిస్తున్నారట. దీనిలో భాగంగా రామ్ చరణ్-అలియా భట్ పై ఓ సాంగ్ చిత్రీకరణకు యూనిట్ సిద్దమైందట. దీనికోసం ఓ స్పెషల్ సెట్ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి పట్టుదల చూస్తుంటే ఎలాగైనా ప్రకటించిన విధంగా జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేస్తారు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు