ఆయనతో పనిచేయడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది- ఆర్ ఆర్ ఆర్ టీమ్

Published on Apr 2, 2020 2:41 pm IST

నేడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ పుట్టినరోజు. దీనితో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ షెడ్యూల్ మీతో పని చేయడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది, మాతో పని చేస్తున్న మీకు కూడా అదే భావన కలుగుతుందని ఆశిస్తున్నాము. మీ భవిష్యత్తు బాగుండాలి కాంక్షిస్తున్నాము అని ట్విట్టర్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ నందు ఆయన పాల్గొన్నారు.

అజయ్ దేవ్ గణ్ ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా చేస్తున్న ఎన్టీఆర్ తండ్రి పాత్రను చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన భీం ఫర్ రామరాజు వీడియో కి విశేష స్పందన దక్కింది. ఆర్ ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More