ఇది తారక్, చరణ్ లపై సన్నివేశమేనా.?

Published on Oct 31, 2020 8:00 am IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ వండర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే వీరి చిత్ర యూనిట్ నుంచి యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు కొమరం భీం టీజర్ తో ఇచ్చిన సాలిడ్ ట్రీట్ అయితే ఇంకా అలానే కొనసాగుతుంది.

అయితే ఇలాంటి ఇద్దరి మాస్ హీరోలను కలిపి ఒకే చిత్రంలో చూస్తామని అలాగే ఇలాంటి చిత్రంలో ఈ దర్శకునితో చూస్తామని ఎవరూ అనుకోని ఉండరు కానీ దానిని జక్కన సుసాధ్యం చేసి చూపించాడు. ఇక ఈ ఇద్దరిపై సెపరేట్ గా శూవుట్ చేస్తాడా లేక అల్లూరి మరియు భీం లను కలిపి ఒకే సన్నివేశంలో చూపిస్తారా అన్న దానికి కూడా సమాధానం అవుననే చెప్పారు.

అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ మాత్రం ఈ ఇద్దరి మీద సన్నివేశాలనే తెరకెక్కిస్తున్నట్టున్నారని చెప్పాలి. నిన్న రాత్రి షూట్ లో యంగ్ టైగర్ మరియు చరణ్ లు పాల్గొన్నట్టుగా పొగ, మంచు గాల్లో ఉంటే నీరు, నిప్పు భూమి మీద ఉన్నాయని సింబాలిక్ గా తమ హీరోలను ఉద్దేశించి వీరి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. సో ఇది బహుశా ఇద్దరి మీద కలిపి ఉండే సన్నివేశమే అని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం జక్కన ఇప్పుడు పరిస్థితులను లెక్కచేయకుండా షూట్ ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More