ఇంటర్వ్యూ : డైరెక్టర్ ఆర్ ఎస్ నాయుడు – ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నాదే.

ఇంటర్వ్యూ : డైరెక్టర్ ఆర్ ఎస్ నాయుడు – ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నాదే.

Published on Sep 15, 2018 6:47 PM IST

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పై హీరోగా నటిస్తూ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీ గురించి చెప్పండి. ఈ సినిమా డైరెక్ట్ చెయ్యకముందు ఎవరి దగ్గర వర్క్ చేశారు ?

నేను ఎవరి దగ్గర వర్క్ చెయ్యలేదండి. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. మా ఊరిలో నేను సినిమాలు చూసి.. నేను నేర్చుకున్న సినిమా ఒకటి, ఇక్కడికి వచ్చాక నేను చూసిన సినిమా ఒకటి. సినిమా పై నా పాయింటాఫ్ వ్యూ చాలా చేంజ్ అయింది. తప్పో రైటో సినిమా అంటే ఇది అని నేను మెంటల్ గా ఒక స్ట్రచర్ కి ఫిక్స్ అయిపోయాను. మళ్లీ ఇప్పుడు ఇంకొకరి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తే.. ఆ ప్రభావం నా మీద పడుతుందేమోనని అనిపించింది. అందుకే ఎవరి దగ్గరా పని చెయ్యలేదు. ఒకవేళ చేస్తే.. నా ఐడియాలజీకి, ఇంకొకరు చేసే సినిమాకి సెట్ అవ్వదు. నేను నా ఫ్లోనే నా శైలిలోనే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. తర్వాత సినిమాలు కూడా అలాగే చేస్తాను.

మీరు ఎవరి దగ్గర పని చేయలేదు అన్నారు. మరి సుదీర్ బాబుగారిని ఎలా అప్రోచ్ అయ్యారు ? ఎలా ఒప్పించారు ?

నేను ఫిల్మ్ స్కూల్ తరువాత ‘నీ మాయలో’ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసి కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ నన్ను పిలిచారు. ఆలా ఉయ్యాలా జంపాలా ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారి పిలిచి నన్ను డైరెక్ట్ చెయ్యమని ఒక కథ చెప్పారు. ఆ కథలో మా ఇద్దరికి సింక్ అవ్వలేదు. దాంతో నేను ఈ సినిమా చెయ్యలేనని చెప్పి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సురేష్ బాబు గారు కూడా ఓ సందర్భంలో నువ్వు మన స్టూడెంట్ వి.. మన దగ్గరే సినిమా చెయ్యాలని ఆఫర్ ఇచ్చారు. కానీ నేను అప్పుడు ఫిల్మ్ కోర్స్ లోనే ఉన్నాను. ఇంకా నేను నేర్చుకోవాలి సార్ అని ఆయనకు చెప్పి ఆ ఆఫర్ ని కూడా వదులుకున్నాను. ఆ తర్వాత విరించి వర్మ పరిచయం అవ్వడం అలా తనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను. ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనిపించింది. ఆ సమయంలో నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ‘స్పందన’. అది సుదీర్ బాబుగారికి బాగా నచ్చింది, ఫైనల్ గా ‘నన్ను దోచుకుందువటే’ సినిమా స్టార్ట్ అయింది.

ఈ సినిమాలో సుదీర్ బాబు క్యారెక్టర్ కొత్తగా ఉంది అంటున్నారు. అసలు ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి ?

మీరు టీజర్ లో చూసి ఉంటారు. అంటే హీరో క్యారెక్టర్ చాలా పోకస్డ్ గా ఉంటుంది. తన గోల్స్ తప్ప, వేరే ఎవర్నీ పట్టించుకోడు. అంటే ఒక ప్రాక్టికల్ పర్సన్. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి ఒక అమ్మాయి ఎలా ఎంటర్ అయింది. ఆ అమ్మాయి ఎంటర్ అయ్యాక, తనకి తెలియకుండానే తాను ఎలా చేంజ్ అయ్యాడు, ఆ క్రమంలో తన గోల్ కి ఎలా దూరం అయ్యాడు. చివరకి తన గోల్ ఎలా ఎచీవ్ అయ్యాడు. హీరోయిన్ ఎలా దక్కిచుకున్నాడు అనేది సినిమా అండి. నేనేదో కొత్తగా రాసాను అని చెప్పను. బట్ నా వే లోనెను కొత్తగా ప్రెజెంట్ చేశాను.

మీరు చెప్పిన స్క్రిప్ట్ విన్నాక, సుదీర్ బాబుగారు మార్పులు ఏమైనా చెప్పారా ?

లేదండి. ఆయన అస్సలు స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అవ్వలేదు. స్క్రిప్ట్ లో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో, బయట కూడా సుదీర్ బాబు గారు అలాగే ఉంటారు. సో నాకు జాబ్ ఈజీ అయింది. ఒక విధంగా చెప్పాలంటే హీరోగారు నాకు పూర్తీ స్వేచ్ఛ ఇచ్చారు. హీరోయిన్ సెలెక్షన్ దగ్గరనుంచి డైరెక్షన్, షాట్స్, బడ్జెట్ ఇలా ప్రతి విషయంలో ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మీకే వదిలేశారు అన్నారు. మీరు ఎంత చెప్పారు బడ్జెట్ ? ఈ సినిమాకి ఎంత అయింది ?

నిజంగా నాకు అస్సలు బడ్జెట్ గురించి తెలియదు అండి. మా కో డైరెక్టర్ వాళ్ళు వచ్చాకే, బడ్జెట్ ఇంత అవుతుందని నాకు తెలిసింది. నేను స్క్రిప్ట్ ఎలా చెప్పాలి. ఎలా డ్రైవ్ చెయ్యాలి అని అలోచిస్తాను తప్పితే ఏనాడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 4.5 కోట్లు దాకా అయిందని చెప్పారు.

ఫిల్మ్ మేకింగ్ కి ముందు మీ స్టడీస్ ఏమిటి ? అసలు మీరు ఎప్పుడుసినిమాలోకి రావాలనుకున్నారు ?

నేను డిప్లమా చేసాను, ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. అది కూడా మధ్యలో వదిలేశాను. ఓవరాల్ గా స్టడీస్ మ్యాటర్ లో నేను పెద్ద కన్ ఫ్యూజన్ పర్సన్ అండి. కానీ సినిమా డైరెక్టర్ అవుతానని మెంటల్ గా ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. అనుకున్న ప్రకారమే అయ్యాను.

ఇందాక మీరు మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మీదే అన్నారు ?

అవునండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నాదే. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా మా ఫాదర్ క్యారెక్టరే.

మీ తర్వాత ప్రాజెక్ట్ లు ఏమిటి ?

కొత్తమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేద్దామని. ఒకాయన అయితే నా సినిమా పోస్టర్ కూడా రిలీజ్ కాకముందే, ఆయన నన్ను నమ్మి అడ్వాన్స్ ఇచ్చారు. మరి ఆయన నన్ను అంతగా నమ్మినందుకైనా నా తర్వాత సినిమా ఆయనకే చెయ్యాలి అనుకుంటున్నా. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు