‘రుద్రమదేవి’ బడ్జెట్ 70 కోట్లు.!

‘రుద్రమదేవి’ బడ్జెట్ 70 కోట్లు.!

Published on Mar 22, 2015 10:04 AM IST

rudhrama-devi
ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఆడియోని రెండు వేదికలపై చేయనున్నారు. అందులో మొదటగా నిన్న వైజాగ్ లో మొదటి మూడు పాటలని రిలీజ్ చేసారు. ఈ వేడుకలో గుణశేఖర్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడ్డానని తెలియజేయడమే కాకుండా ‘మేల్ హీరోస్ కంటే ఎక్కువగా అనుష్క ఈ సినిమా కోసం కష్టపడింది. ఈ సినిమా కోసం నేను చేసిన డీటైల్డ్ అనాలసిస్ చూసాక గోనగన్నా రెడ్డి పాత్ర చేయడం కోసం అల్లు అర్జున్ ముందుకు రావడం, అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకమైన ల్లిరిక్స్ అందించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అకోసం మేము 70 కోట్ల బడ్జెట్ పెట్టామని’ తెలియజేసాడు.

ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు