
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా రెండేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. గత శుక్రవారం విడుదలైన ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్ బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా లనాటి స్టార్స్ నటించడం ఈ సినిమాకి మొదటి ప్లస్ అయితే, మనకు తెలియని హిస్టారికల్ సినిమాని భారీ భారీ సెట్టింగులతో ఆవిష్కరించి చూపించడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
రుద్రమదేవి సినిమా ఇరు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. కేవలం లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. కేవలం రెండు రోజుల్లోనే రుద్రమదేవి ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కి దగ్గరవుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో 3డి వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రెండు రోజుల ఓవర్సీస్ రిపోర్ట్ మీకోసం..
| వారం | కలెక్షన్స్(డాలర్స్ లో) |
|
గురువారం ప్రీమియర్స్
|
$126,277K |
| శుక్రవారం | $179,631K |
| శనివారం | $252,239K |
| మొత్తం | $558,211K [₹ 3.62 cr] |

