
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా రెండేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’ గత శుక్రవారం విడుదలైన ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్ బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా లనాటి స్టార్స్ నటించడం ఈ సినిమాకి మొదటి ప్లస్ అయితే, మనకు తెలియని హిస్టారికల్ సినిమాని భారీ భారీ సెట్టింగులతో ఆవిష్కరించి చూపించడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
రుద్రమదేవి సినిమా మొదటి మూడు రోజులు ఇరు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయ్యింది. వీక్ డే అయిన ఈ రోజు కూడా అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కి దగ్గరవుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లో మొదటి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వివరాలు మీకోసం..
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 8.10 కోట్లు |
| సీడెడ్ | 3.44 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 1.75 కోట్లు |
| గుంటూర్ | 1.73 కోట్లు |
| తూర్పు గోదావరి | 1.55 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 1.08 కోట్లు |
| కృష్ణా | 1.07 కోట్లు |
| నెల్లూరు | 0.82 కోట్లు |
| ఏపి, తెలంగాణ మొత్తం | 19.54 కోట్లు |
| ఓవర్సీస్ | $726,528K (సుమారు 4.5 కోట్లు) |

