తెలుగు ప్రేక్షకులను సుమారు సంవత్సర కాలంగా ఇదిగో రిలీజ్, అదిగో రిలీజ్, ఇప్పుడు చేసేస్తున్నాం అని చెప్పుకుంటూ.. వరుసగా వాయిదాలు వేసుకుంటూ వస్తూ వస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దాదాపు 9 ఏళ్ళ పాటు రీసర్చ్ చేసి గత మూడేళ్ళుగా కష్టపడి వర్క్ చేస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ ని ప్రపంచం తల్లకిందులైనా సరే అక్టోబర్ 9న రిలీజ్ చేస్తామని అన్నారు. అన్నట్టుగానే పక్కాగా రిలీజ్ చేస్తామనే మాటమీదే ఇవాల్టికీ ఉన్నారు. కానీ ఒక చిన్న మార్పుతో రిలీజ్ చెయ్యడానికి యోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇన్ని రోజులు సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడానికి ప్రధాన కారణం సినిమాకి సంబందించిన 3డి వర్క్ ఫినిష్ కాకపోవడం. కానీ అన్ని ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అది కుదరడం లేదని సమాచారం. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రుద్రమదేవికి సంబందించిన అన్ని అడ్డులు తొలగిపోయాయి. కచ్చితంగా అక్టోబర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. కానీ తెలుగు, తమిళంలో 2డి రిలీజ్ ఉంటుంది. కానీ 3డి రిలీజ్ ఎక్కువ భాగం ఉండకపోవచ్చని తెలిపారు. దీని ప్రకారం చూసుకుంటే ఇన్ని రోజులు దేనికోసమైతే ఆగారో దానినే ఆపేసి రిలీజ్ చేయాల్సి వస్తే ఇంత ఎఫర్ట్ వృధా అయిపోతుందేమో అని పలువురు భావిస్తున్నారు. మరి 2డితో పాటు 3డి రిలీజ్ కూడా ఉంటుందా.? లేదా.? అన్నది గుణశేఖర్ గారీ ఖరారు చేయాలి.
టైటిల్ రోల్ అయిన రుద్రమదేవి పాత్రలో అనుష్క కనిపించనుంటే, చాళుక్య వీరభద్రుడిగా రానా దగ్గుబాటి, గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.


