‘రుద్రమదేవి’ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్!

‘రుద్రమదేవి’ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్!

Published on Oct 12, 2015 11:20 AM IST

Rudhramadevi
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ రుద్రమదేవి గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రాణీ రుద్రమదేవి లాంటి వీరవనిత చారిత్రక కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ కనిపించింది. ఇక విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి వారాంతం బాక్సాఫీస్ వద్ద 31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి స్ట్రాంగ్‌‍గా నిలబడిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఇలాంటి సినిమాకు మొదటివారాంతం ఈ స్థాయి కలెక్షన్స్ రావడం విశేషమనే చెప్పాలి. ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్నిచోట్లా ఒకేసారి విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మరింత కలెక్షన్స్ రాబట్టే దిశగా వెళుతోంది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియో స్కీపిక్ 3డీ సినిమాగా తెరకెక్కిన ‘రుద్రమదేవి’, హిందీ, మళయాలంలోనూ తెలుగు వర్షన్‌తో పాటే విడుదలైంది.

తాజా వార్తలు