నైజాంలో 12కోట్ల మార్క్ క్రాస్ చేయనున్న రుద్రమదేవి

నైజాంలో 12కోట్ల మార్క్ క్రాస్ చేయనున్న రుద్రమదేవి

Published on Oct 12, 2015 7:00 PM IST

rudhramadevi

తెలుగు ప్రేక్షకులకు భారీ చిత్రాలను అందించిన డైరెక్టర్ గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన రుద్రమదేవి సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క రుద్రమదేవిగా నటించిన ఈ హిస్టారికల్ 3డి సినిమాలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కనిపించాడు. తెలుగు ప్రజల ఘనతని చాటి చెప్పిన రుద్రమదేవి కథ నగానే ప్రజలందరూ ఈ సినిమాని చూడటానికి బాగా ఆసక్తి చూపడం, అలాగే దసరా సీజన్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.

మొదటి వీకెండ్ ఆంధ్ర, తెలంగాణలో కలిపి 19.5 కోట్ల షేర్ మార్క్ సాధించిన ఈ సినిమా ఒక్క నిజాంలోనే మూడు రోజుల్లో 8 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అలాగే నైజాం ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మొదటి వారం పూర్తయ్యే లోపు ఒక్క నైజాంలోనే రుద్రమదేవి సినిమా 12 కోట్లకి పైనే షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. అలాగే మిగతా ఏరియాల్లో కూడా ఇదే విధంగా కలెక్షన్స్ ని సాధిస్తోంది. వీటితో పాటు ఒవరసీస్ లో కూడా మొదటి వారంలో 1 మిలియన్ మార్క్ టచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. గుణశేఖర్ ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు.

తాజా వార్తలు