సమీక్ష : “రుద్రంగి” – కొన్ని చోట్ల ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా

Published on Jul 8, 2023 3:04 am IST
Rudrangi Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: జగపతి బాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్ నంద, డివి వడ్త్యా

దర్శకుడు : అజయ్ సామ్రాట్

నిర్మాత: రసమయి బాలకిషన్

సంగీతం: ఐస్ నవల్ రాజా

సినిమాటోగ్రఫీ: సంతోష్ షనమోని

ఎడిటర్ : బి నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో మమతా మోహన్ దాస్, విమలా రామన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “రుద్రంగి”. మరి బాలయ్య గెస్ట్ గా వచ్చి ప్రమోట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..ఈ చిత్రం 1940వ దశకంలో సెట్ చేయబడింది కాగా ఈ చిత్రంలో ఓ క్రూరమైన మూర్ఖుడు అలాగే ఆడవారి పట్ల అధికమోహం కలవాడు, తన ప్రాంత ప్రజలను ఎలాంటి దయ లేకుండా పాలించే రాజు భీమ్ రావు దేశముఖ్(జగపతి బాబు) కాగా అతడు అప్పటికే మీరాభాయి(విమలా రామన్) పెళ్లి చేసుకుంటాడు కానీ తనకి ఉన్న కామోద్రేక భావనలతో మరో స్త్రీ జ్వాలా భాయి(మమతా మోహన్ దాస్) ని కూడా పెళ్లి చేసుకుంటాడు. అయితే జ్వాలా తాలూకా స్వభావం నడవడిక భీమ్ రావు ఆమెని దూరంగా ఉండమని చెప్తాడు. అయితే ఓరోజు భీమ్ రుద్రంగి(గానవి లక్ష్మణ్) అనే మరో అమ్మాయిని చూసి ఆమె అందం పట్ల మోహితుడు అవుతాడు. దీనితో ఆమెతో ఎలాగైనా సరే శారీరిక సుఖం పొందాలని అనుకుంటాడు. మరి ఈ ప్రక్రియలో ఆమెకోసం భీమ్ రావు ఓ ఊహించని నిజాన్ని తెలుసుకుంటాడు. మరి అది ఏంటి? ఆమెని తాను వశపరుచుకుంటాడా లేదా అసలు చివరికి ఏం జరిగింది అనేది అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది మాత్రం వెర్సటైల్ నటుడు జగపతిబాబు కోసమే అన్ని చెప్పాలి. తాను నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఇందులో తన పాత్ర మరింత కొత్తగా ఉంటే దానిని అంతే అద్భుతంగా తాను రక్తి కట్టించారని చెప్పాలి. అసలు దయా దాక్షిణ్యాలు లేని పాలకుడిగా ఓ కామాంధునిగా పాత్రలో ఒదిగిపోయి అన్ని రసాలు అద్భుతంగా పండించారు. అలాగే తనపై కొన్ని సీన్స్ పలు మేనరిజం లు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

ఇక మరో నటుడు ఆశిష్ గాంధీ కూడా మంచి నటన కనబరిచారు. తనపై డిజైన్ చేసిన సీన్స్ గాని జగపతిబాబు పై తాను తిరగబడే ఎపిసోడ్స్ కూడా నీట్ గా హ్యాండిల్ చేయబడ్డాయి. ఇక మరో కీలక పాత్రలో నటించిన హీరోయిన్స్ మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మి లు, విమలా రామన్ లు అయితే తమ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తారు. జ్వాలా భాయి గా మమతా మోహన్ దాస్ ఇంటర్వెల్ బ్లాక్ లో అదరగొట్టేసింది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఫస్టాఫ్ వరకు ఇంట్రెస్టింగ్ గా మంచి ఎంగేజింగ్ గానే ఉంటుంది. కానీ సెకండాఫ్ లోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇందులో ప్రొసీడింగ్స్ నెమ్మదిస్తాయి. అలాగే సినిమాలో మెయిన్ థీమ్ కూడా పక్కకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

అలాగే సెకండాఫ్ లో నెమ్మదయ్యే కథనం సినిమాని చాలా బోర్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. దీనితో సినిమా మరీ పెద్దదిలా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఈ చిత్రంలో సరైన ఎమోషన్స్ కూడా మిస్ అవుతాయి. కొంతవరకు ఓకే కానీ ఇంకా కొన్ని సీన్స్ ని బెటర్ గా ఫాస్ట్ గా చూపిస్తే బాగుండు.

ఇక మరో పాయింట్ ఏమిటంటే సినిమాలో ఎంతో టెర్రఫిక్ గా చూపించిన మమతా మోహన్ దాస్ పాత్రని ఇక ఒక టైం కి వచ్చేసరికి కంప్లీట్ గా పక్కన పెట్టేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కూడా సెకండాఫ్ లో బిగ్ బ్లండర్ అని చెప్పొచ్చు. ఇక వీటితో పాటుగా సినిమాలో యాక్షన్ బ్లాక్ లు సినిమా క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకర్స్ ఖర్చు సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ అలాగే నటీనటుల కాస్ట్యూమ్స్ లో కూడా కనిపిస్తుంది. అయిస్ నవళ్ రాజా సంగీతం, సంతోష్ షనమోని సినిమాటోగ్రఫీ లు పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఒకే ఏమన్నా చేసి ఉంటే సెకండాఫ్ లో చేయాల్సింది. ఇక దర్శకుడు అజయ్ సామ్రాట్ విషయానికి వస్తే..

ఈ చిత్రానికి తాను పర్వాలేదనిపించే వర్క్ చేసాడు. అయితే ఫస్టాఫ్ వరకు అన్ని థింగ్స్ బాగానే హ్యాండిల్ చేసిన తాను సెకండాఫ్ విషయంలో తడబడ్డాడు. అక్కడ కూడా సరిగ్గా హ్యాండిల్ చేసి ఉంటే ఓ కంప్లీట్ ప్యాకేజీలా ఈ చిత్రం అయ్యేది. జగపతి బాబు ఇతర మెయిన్ లీడ్ కాస్ట్ ను తాను బాగా డిజైన్ చేసాడు కానీ నరేషన్ విషయంలో కూడా ఇంకా బెటర్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ “రుద్రంగి” లో జగపతి బాబు వన్ మాన్ షో అయితే కనిపిస్తుంది. అలాగే మమతా మోహన్ దాస్, గానవి లు కూడా మంచి నటన కనబరిచారు. అలాగే కొన్ని అంశాలు వరకు ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంటుంది కానీ సెకండాఫ్ ని, పలు ఎమోషన్స్ ని కీలక బ్లాక్ లు బాగా డిజైన్ చేసి ఉంటే బాగున్ను. వీటితో అయితే ఈ వారాంతానికి కొంతమేర ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :