అభిమానుల కోసం బాలయ్య.. ఫ్యామిలీల కోసం తేజ్

Published on Dec 16, 2019 10:41 am IST

ఈ డిసెంబర్ 20న కెఎస్.రవికుమార్, బాలయ్యల ‘రూలర్’, సాయి తేజ్, మారుతిల ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు విడుదలకానున్నాయి. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే పోటీ ఎంత ఉన్నా రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ పరంగా సమానమైన ఆదరణ దక్కనుంది. అదెలా అంటే.. బాలయ్య సినిమా మొదటిరోజు అంటే పూర్తిగా అభిమానులతో, మాస్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోతాయి. కాబట్టి ఆరోజు సినిమా చూడటం ఫ్యామిలీ ప్రేక్షకులకి కొంత కష్టమే.

కానీ వారి కోసం ‘ప్రతిరోజూ పండగే’ రూపంలో పెద్ద ఆల్టర్నేట్ ఉంది. ప్రతి శుక్రవారం సినిమాకు వెళ్లాలనుకునే ప్రతి ఫ్యామిలీలకు తేజ్, మారుతిల సినిమా మంచి ఛాయిస్. ఇలా రెండు సినిమాలు రెండు ప్రధాన ప్రేక్షక వర్గాలను ఆకట్టుకోనుండటంతో ఒక సినిమా నుండి ఇంకో సినిమాకు నష్టం వాటిల్లకుండా రెండింటికీ మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి. ఇక ఏ సినిమా విజయం ఏ స్థాయిలో ఉంటుందనేది తొలిరోజు ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ మీదే ఆధారపడి ఉంటుంది.

సంబంధిత సమాచారం :

X
More