సల్మాన్ దిగడంతో తెలుగు హీరోలకు పోటీ పెరిగింది

Published on Dec 11, 2019 7:24 pm IST

చివరి నెల డిసెంబర్లో విడుదలకానున్న సినిమాల్లో పెద్దవి రవికుమార్, బాలయ్యల ‘రూలర్’, సాయి తేజ్, మారుతిల ‘ప్రతిరోజూ పండగే’. డిసెంబర్ 20న రానున్న ఈ రెండు చిత్రాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. అంతేకాదు ఈ రెండు చిత్రాలకి బయటి సినిమాల నుండి కూడా పోటీ పెరిగింది. ఎందుకంటే 20వ తేదీనాడే కార్తి చిత్రం ‘దొంగ’ రిలీజ్ కానుంది. కార్తి గత చిత్రం ‘ఖైదీ’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాకి మంచి ఒపెనింగ్స్ దక్కవచ్చు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రభుదేవాల ‘దబాంగ్ 3’ కూడా 20వ తేదీన హిందీతో పాటు తెలుగునాట కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. ఏపీ, తెలంగాణల్లోని ముఖ్యమైన అన్ని చోట్లా హిందీ, తెలుగు రెండు వెర్షన్లు విడుదలవుతాయి. సల్మాన్ ఖాన్ కు సాధారణంగానే హైదరాబాద్ లాంటి సిటీల్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ. తెలుగు వెర్షన్ కూడా ఉండటంతో అది మరింత పెరుగుతుంది. కాబట్టి సల్మాన్ చిత్రం నుండి బాలయ్య, సాయి తేజ్ సినిమాలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

సంబంధిత సమాచారం :

X
More