‘మారుతి – నాని’ సినిమా పై మళ్ళీ రూమర్ ?

Published on Nov 29, 2020 1:49 am IST

గత కొన్ని నెలలుగా ఆనవాయితీ రూమర్ గా మారిపోయిన రూమర్ ‘మారుతి – నాని’ కాంబినేషన్ మళ్ళీ రాబోతుందని. నిజానికి ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే కోరుకున్నారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు వీరి సినిమా పట్టాలెక్కలేదు. మధ్యలో కరోనా వచ్చి లాక్ డౌన్ విధించడంతో వీరి సినిమా మరింతగా ఆలస్యం అయింది.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. ‘మారుతి – నాని’ కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మారుతి ఇప్పటికే నానికి కథ చెప్పినట్లు.. నాని కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. అందుకే వీరి కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా వస్తే భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :

More