ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే “అ” డైరెక్టర్ దశతిరిగినట్లే…?

Published on Jun 15, 2019 11:36 am IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ “అ” అనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు పరిశ్రమకు సరికొత్త స్క్రీన్ ప్లే ని పరిచయం చేశాడు. “అ” మూవీ కథ, కథనంకి ఇంప్రెస్ అయిన హీరో నాని తన సొంత నిర్మాణ సంస్థలో ఈ మూవీని నిర్మించారు. కమర్షియల్ గా పర్వాలేదు అనిపించిన ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మకి మంచి పేరుసంపాదించి పెట్టింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా “కల్కి” అనే మరో భిన్నమైన సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

ప్రశాంత్ వర్మ తన మూడవ చిత్రంగా మరో క్రేజి ప్రాజెక్ట్ చేయనున్నాడని ఇండస్ట్రీలో పుకార్లు మొదలైనాయి. అదేమిటంటే ఈ యంగ్ డైరెక్టర్ తో హీరో ధనుష్ ఓ మూవీ చేయడానికి సిద్ధమైనారట. ధనుష్ కొరకు ఓవినూత్నమైన కథను ప్రశాంత్ వర్మ రెడీ చేశారట. ఈ మూవీలో ధనుష్ పాత్రకూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. ధనుష్ తో మూవీ అంటే ప్రశాంత్ వర్మ సౌత్ ఇండియా లెవెల్లో పాపులర్ కావడం ఖాయం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే ప్రశాంత్ వర్మ దశ తిరిగినట్లే మరి.

సంబంధిత సమాచారం :

X
More