సాయి పల్లవి తో పెళ్లి వార్తలను కొట్టిపారేసిన తమిళ డైరెక్టర్ !

సాయి పల్లవి తో పెళ్లి వార్తలను కొట్టిపారేసిన తమిళ డైరెక్టర్ !

Published on Mar 27, 2019 8:30 PM IST

Saipallavi

కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ , రైజింగ్ హీరోయిన్ సాయి పల్లవి ని పెళ్లి చేసుకోనున్నాడని తమిళ మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. తాజాగా ఈ వార్తలను కొట్టిపారేశారు విజయ్. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో విజయ్, సాయి పల్లవి తో దియా (కణం) అనే సినిమా ను తెరెక్కించాడు.

ఇక ప్రస్తుతం తన ఫోకస్ అంతా జయలలిత బయోపిక్ ఫై పెట్టాడు ఈ దర్శకుడు. తలైవి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనుండగా సముద్రఖని , సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

100 కోట్ల బడ్జెట్ తో విబ్రి మీడియా బ్యానర్ ఫై విష్ణు ఇందూరి నిర్మించనున్న ఈ చిత్రం హిందీలో జయ అనే టైటిల్ తో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు