ఇంటర్వ్యూ : కార్తికేయ – ‘ఆర్ఎక్స్ 100’టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది !

Published on Jul 10, 2018 9:52 pm IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తో తెలుగు తెరకు పరిచియమవుతున్న యువ హీరో కార్తికేయ ఈ చిత్రం ఈ నెల 12 న విడుదలకానున్న సంధర్బంగా ఆయన మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం … ‘

సినిమా ఆర్ ఎక్స్ 100 రైడ్ ఎలా ఉంది సార్ ?

వాస్తవంగా ఆర్ ఎక్స్ 100 బైక్ నడిపినట్లుగానే, ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉందని, తనకు ఈ రైడ్ లో గతుకులు, సౌండ్ లతో డిఫరెంట్ గా థ్రిల్లింగ్ గా అనిపించింది.

ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అని టాగ్ లైన్ పెట్టారు కదా, దాని గురించి చెప్పండి?

వాస్తవానికి లవ్ స్టోరీ అనగానే, అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ లవ్ అండ్ బయట మూవీస్ కి కాఫీ షాప్స్ కి తిరిగి ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. కానీ మా సినిమా ఆలా కాదు, ఇది రియాలాస్టిక్ , అండ్ రస్టిక్ ఫీల్ వున్న స్టోరీ, నాచురల్ గా వుండే లవ్ ఫీల్ ఈ సినిమాలో మీకు కనపడుతుంది.

సినిమాలో ప్రతీకార నేపథ్యం ఏమైనా ఉంటుందా ?

అదేమీ ఉండదండి, నేను ఇప్పుడైతే స్టోరీ రివీల్ చేయలేను. మీరు సినిమా చూసి తెలుసుకోవలసిందే.

హీరోయిన్ ని ఎన్ని ముద్దులు పెట్టుకున్నారు ?

ఎన్ని అనేది లెక్కపెట్టలేదండి, స్టోరీ డిమాండ్ మేరకే ముద్దు సీన్లు చేయడం జరిగింది.

సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నట్లున్నారు?

అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, నాకు తెలిసి ఏదైనా సినిమాల్లో, హీరో అంటే మంచోడు, హీరోయిన్ అంటే మంచిది, విలన్ అంటే చెడ్డోడు అనే చూసాం. ఇది ఆలా కాకుండా రియల్ లవ్ కి అవసరమయ్యే సన్నివేశాలు, నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది దానికోసం ఏమైనా చేస్తాం అనే అంశం బాగుటుంది ఈ సినిమాలో. ఈ టైపు జానర్ లో ఇప్పటివరకు టాలీవుడ్ లో సినిమా రాలేదని మాత్రం చెప్పగలను.

అర్జున్ రెడ్డి లా ఉంటుందా మూవీ?

ఆలా అని కాదు, అందులో హీరో ఎక్కువ కోపంగా, సీరియస్ గా ఉంటాడు. కానీ ఇందులో నా క్యారెక్టర్ కొంత సేపు చాలా అమాయకుడుగా, ఆ తరువాత బాగా కోపోద్రిక్తంగా ఉంటుంది. ఆలా అన్ని వేరియేషన్స్ ఉంటాయి నా పాత్రలో

మీరు మూవీలో ట్రూ లవర్ గా చేస్తున్నారట నిజమేనా ?

అది మీరు సినిమా చూసి చెప్పాల్సిందే. అతను హీరోయిన్ ని నిజంగా ప్రాణంగా ప్రేమిస్తున్నడా, లేక ఆమెని ఒక సైకో లా వేధిస్తాడా అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.

మీ క్యారెక్టర్ ఏంటి సినిమాలో ?

ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ అని కాదు, ఒక నార్మల్ మనిషి ఒక ఊరిలో తండ్రితో కలిసి వుండే ఒక కుర్రాడు, తన జీవితంలోకి అమ్మాయి రాగానే మారిపోయే క్యారెక్టర్. అమ్మాయివల్ల తన జీవితం ఎలా మారింది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అనేది అసలు కథ.

మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? సినిమాల్లోకి ఎలా వచ్చారు ?

హైదరాబాద్ లోని వనస్థలిపురం. మాకు అక్కడ స్కూల్ వుంది, చిన్నప్పటినుండి చదువు పై కంటే సినిమాలపై మరింత ఆసక్తి ఉండేది. పెద్దయ్యాక యాక్టింగ్, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకున్నాను. ఏడు, ఎనిమిది షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఆ తరువాత నేను రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేశాను. అందులో ఒకటి రిలీజ్ కాలేదు, ఇంకొకటి రిలీజ్ అయినా, ఎవరికి పెద్దగా తెలియలేదు. అనుకోకుండా ఈ మూవీ లో హీరోగా అవకాశం వచ్చింది.

దర్శకుడు మిమ్మల్నే హీరోగా ఎలా ఎంచుకున్నారు?

నిజానికి ఈ సినిమా కథని దర్శకుడు విజయ్ దేవరకొండకి చెప్దామనుకున్నారు , కానీ ఆయన అప్పటికే మంచి స్టార్ అయ్యాక, తనకి సెట్ కాదు, ఎవరైనా కొత్త హీరో అయితేనే దీనికి కరెక్ట్ ఆయనకు అనిపించిందట. అనుకోకుండా ఒక ఫ్రెండ్స్ ద్వారా దర్శకుడుకి నా ఫొటోస్ నచ్చి, నా టాలెంట్ చూసాక ఆయన నాతోనే చేస్తాను అని అన్నారు. అలా సినిమా రూపొందింది.

నెక్స్ట్ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా?

వచ్చాయండి, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి గుర్తింపు వచ్చింది. కొంతమంది నాతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతనే నా తదుపరి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను.

మీకు బైక్స్ అంటే ఇష్టమా ?

నాకు బైక్స్ అంటే ఇష్టం లేదు, నాకు సినిమానే ప్రపంచం. మా ఫ్రెండ్స్ కి బైక్స్ వున్నాయి. వాటిని సినిమా కోసం నేర్చుకుని సినిమాలో నడపడం జరిగింది. వారి హెల్ప్ వల్ల నేను సినిమాలో బైక్ డ్రైవింగ్ బాగా చేయగలుగుతున్నాను.

సంబంధిత సమాచారం :