విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న క్రేజీ చిత్రం !

Published on Jul 2, 2018 11:45 am IST

ట్రైలర్, పాటలతో అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసిన క్రేజీ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. టైటిల్ తోనే భిన్నత్వాన్ని చాటుకున్న ఈ సినిమా డాషింగా, రియలిస్టిక్ గా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. పైగా చిత్ర టీమ్ భారీగా ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేయడంతో సినిమా జనాల్లోకి బాగానే వెళ్ళింది.

ఈ చిత్రాన్ని జూలై 12వ తేదీన భారీ ఎత్తున విడుదలచేయనున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అజయ్ భూపతి డైరెక్ట్ చేశారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. సీనియర్ నటుడు సింధూర పువ్వు రాంకీ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :