‘ఆర్ఎక్స్100’ హీరో తదుపరి చిత్రం కన్ఫర్మ్ !

rx100 11

నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈచిత్రం ‘ఆర్ఎక్స్ 100’ . ఇటీవల విడుదలైన ఈచిత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

ఇక తాను నటించిన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కార్తికేయ తన తదుపరి చిత్రానికి రెడీ అయ్యాడు. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఆయనతో సినిమాకు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈయువ హీరో. గతంలో ఆయన ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినెమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మించనుండడం విశేషం.

Exit mobile version