అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. ఈ చిత్రం నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే మౌత్ టాక్ బాగుండడం అలాగే సినిమా విడుదలకు ముందే ట్రైలర్ తోని ప్రేక్షకులను అక్కట్టుకోవడంతో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. ఇక ఈచిత్రం యొక్క మొదటి రోజు వసూళ్లు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రెండు రాష్ట్రల్లో ఈ చిత్రం రూ. 1.42 కోట్ల షేర్ ను రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది.
ఫుల్ రన్ లో ఈచిత్ర వసూళ్లు భారీ గానే ఉండనున్నాయి . ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా అక్కట్టుకుంటుంది. ఇక ఈ చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది . చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.


