‘ఆర్ఎక్స్100’ రెండు రోజుల కలక్షన్స్ !

Published on Jul 14, 2018 12:00 pm IST

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. ఇక జులై12న ప్రేక్షకులముందుకు వచ్చినా ఈ చిత్రం యువతను బాగా అక్కట్టుకుంటున్నది. చిన్న చిత్రం గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నడం విశేషం. ఇక ఈచిత్రం మొదటి రోజు వసూళ్లుతోనే సినీ వర్గాల్లో సైతం ఆసక్తిని కలిగించి రెండోరోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. రెండు రాష్ట్రల్లో ఈ చిత్రం రెండు రోజులకు గాను రూ. 2.51 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ ముఖ్య పాత్రలో నటించారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అంధించారు.

సంబంధిత సమాచారం :

X
More