‘ఆర్ఎక్స్ 100’ ఆ ఒక్క థియేటర్ లోనే అంత కలెక్ట్ చేసిందా !

Published on Aug 4, 2018 9:15 am IST

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. జులై 12న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సుమారురూ . 11కోట్ల పైచిలుకు షేరును రాబట్టి డబుల్ బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు తాజా గా మరో రికార్డు ను నెలకొల్పింది. ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని దేవి 70ఎం ఎం థియేటర్ లో 23 రోజులకుగాను ఈచిత్రం రూ. 50,45,985 లక్షల గ్రాస్ ను రాబట్టింది. పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యమే ఈ తరహా కలెక్షన్స్ ను రాబట్టుకోవడం సాధ్యమవుతుంది. అలాంటిది కేవలం 2.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి చిన్న చిత్రం గా విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ ఈ రికార్డును సాధిచడం విశేషం.

ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటులు రాంకీ , రావు రమేష్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More