స్టార్ హీరో కొడుకుతో హిందీ ‘ఆర్ ఎక్స్100’.

Published on Aug 6, 2019 10:22 am IST

తెలుగు సెన్సేషనల్ మూవీ ‘ఆర్ ఎక్స్ 100’ హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తుండగా అహన్ శెట్టి సరసన హీరోయిన్ గా తారా సుతారియా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో సౌత్ ముంబై థియేటర్లో నేడు చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

గత సంవత్సరం జులైలో విడుదలైన ఆర్ ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కార్తికేయ,పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మరి బాలీవుడ్ లో ఈ మూవీ ఎన్ని సంచలనాలు నమోదు చేయనుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :