అక్కడ అర్జున్ రెడ్డి అద్భుతం, మరి ఆర్ ఎక్స్ 100..?

Published on Aug 7, 2019 7:06 am IST

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ ప్రత్యేకమైన చిత్రాలు. ఇవి చిన్న చిత్రాలుగా విడుదలై అతిపెద్ద విజయాలను నమోదు చేశాయి. ఇద్దరు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, కార్తీకేయలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా విజయ్ డిఫరెంట్ రఫ్ ఆటిట్యూడ్ తో యూత్ మెచ్చిన రౌడీ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ రెండు చిత్రాలకు ఉన్న మరో పోలిక బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు కావడం. ‘అర్జున్ రెడ్డి’ స్టోరీ హ్యాపీ ఎండింగ్ తో ముగిస్తే ‘ఆర్ ఎక్స్ 100’ హీరో మరణంతో విషాదాంతం అవుతుంది.

ఈ రెండు చిత్రాల మరో ప్రత్యేకత దర్శకులు సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతి లకు మొదటి చిత్రాలు కావడం, ఇద్దరూ వాస్తవ సంఘటనల ఆధారముగా తెరక్కెక్కించడం. కాగా ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఇటీవల ‘కబీర్ సింగ్’ గా విడుదలై సంచల విజయాన్ని నమోదుచేసింది.ఏకంగా 280కోట్ల వసూళ్లు సాధించి 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈమూవీ లో హీరోగా నటించిన షాహిద్ తను ఎప్పటికీ ఊహించని, మరపురాని విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రానికి కూడా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.

ఇక ఆర్ ఎక్స్ 100 మూవీ హిందీ రీమేక్ షూటింగ్ కూడా నిన్న గ్రాండ్ గా ప్రారంభమైంది.బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తుండగా అహన్ శెట్టి సరసన హీరోయిన్ గా తారా సుతారియా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు.

మరి అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయం సాధించగా మరి ఆర్ ఎక్స్ 100రీమేక్ ఏమవుతుందో చూడాలి.ఈ చిత్రంలో ఒకప్పటి యాక్షన్ హీరో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరో కావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమే. ఐతే దర్శకుడిగా బాలీవుడ్ కి చెందిన మిలన్ లుథ్రియా ను ఎంచుకున్నారు. ఏదిఏమైనా టాలీవుడ్ కి చెందిన రెండు ప్రత్యేకమైన చిత్రాలు బాలీవుడ్ కి వెళ్లడం చెప్పుకోదగ్గ విషయమే.

సంబంధిత సమాచారం :