
టాలీవుడ్ భారీతనం ఉన్న సినిమాలు తీయడంలో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యెక పేరుంది. ‘ఈగ’ లాంటి గ్రాఫికల్ సినిమాని కూడా ప్రేక్షకులు మెచ్చేలా తీసి అందరి ప్రశంశలు అందుకున్నాడు. రాజమౌళి ప్రస్తుతం పీరియాడిక్ ఫిల్మ్ అయిన ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మహా భారతం నేపధ్యంలో ఓ సినిమా చేయాలనేది రాజమౌళికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక..
తన తదుపరి సినిమాగా తన కోరికని తీర్చుకునే విధంగా రాజమౌళి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక తెలిపిన సమాచారం ప్రకారం… మహా భారత యుద్దాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన నవల ‘పర్వ’. ఎన్. ఎల్ భైరప్ప ఈ నవలని రచించారు. ప్రస్తుతం రాజమౌళి ఈ నవల ఆధారంగా భారతాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అలాగే రాజమౌళి ప్రస్తుతం ఆ నవల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడని సమాచారం. కానీ ఇది ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

