ప్రభాస్ ‘ఈశ్వర్’ నటుడి కొత్త సినిమా.. త్వరలో థియేటర్లలోకి ‘సాV3’

ప్రభాస్ ‘ఈశ్వర్’ నటుడి కొత్త సినిమా.. త్వరలో థియేటర్లలోకి ‘సాV3’

Published on Jun 11, 2026 9:00 PM IST

ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా ‘సాV3’ చిత్ర బృందం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఈశ్వర్’ చిత్రంలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన కృష్ణ మాయ.. ఇప్పుడు ‘సాV3’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రణాళికాబద్ధంగా తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘ఈశ్వర్’ సినిమా జ్ఞాపకాలను నటుడు అదిరే అభి, తదితరులు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రావణ సంధ్య, హారిక రవి పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు