సాహో యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్

Published on Aug 29, 2019 8:34 am IST

ప్రభాస్ సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తుంది. అక్కడ ఐమాక్స్ షోస్ తో పాటు రెగ్యులర్ షో బుకింగ్స్ లో సాహో మూవీ రికార్డ్ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. ఆగస్టు 28వరకు అందిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఐమాక్స్ మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా అన్ని భాషలలో కలిపి $532,727 వసూళ్లు రాబట్టింది. ఇక ఇక కేవలం తెలుగు ఐమాక్స్ మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $511,702 వసూళ్లు సాధించింది. కేవలం హిందీ వర్షన్ కి గాను $16,899 మరియు తమిళ వర్షన్ ద్వారా $4,126 వసూళ్లు కొల్లగొట్టింది.

ఇక ఓవర్ ఆల్ గా అన్ని భాషలలో ఐమాక్స్ షో ల వరకు $77418 మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $455309 వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక నేడు అడ్వాన్స్ బుకింగ్స్ జరగనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత మరింత పెరిగే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :