ఆ దేశంలో సాహో టికెట్స్ హాట్ కేకుల్లా…!

Published on Aug 22, 2019 1:03 am IST

దేశంలోనే కాదు బయట కూడా సాహో మానియా మాములుగా లేదు. దీనితో సాహో అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్స్ విషయంలో దుమ్మురేపుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అధికంగా భారతీయులు, అందులోను తెలుగు వారుండే ఆస్ట్రేలియా దేశంలో సాహో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయట. ఆస్ట్రేలియా లోని ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాలలో ఈ జోరు ఇంకా బాగుందట. దీనితో బుకింగ్స్ ద్వారానే ఓ మంచి ఫిగర్ ని సాధించే అవకాశం కలదు.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహో మూవీ ఈ నెల 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకి పాండే జాకీ ష్రాఫ్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :