ఆ రెండు జిల్లాలకు కలిపి ‘సాహో’ ధర 20 కోట్లు ?

ఆ రెండు జిల్లాలకు కలిపి ‘సాహో’ ధర 20 కోట్లు ?

Published on Jun 14, 2019 10:12 AM IST

ఈ ఏడాదిలో విడుదలకానున్న అతి పెద్ద చిత్రం ‘సాహో’. సినిమాపై భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ తారాస్థాయి అంచనాలున్నాయి. అందుకే చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వసూళ్లకు కీలకమైన గోదావరి జిల్లాలో రేట్లు చూస్తే షాక్ తగలక మానదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులు 20 కోట్లు పలికినట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం ‘బాహుబలి 2’ కంటే ఎక్కువే. గతంలో ‘బాహుబలి 2’ తూర్పు గోదావరిలో 10 కోట్లకు, పశ్చిమ గోదావరిలో 8 కోట్లకు అమ్ముడైంది. ఈ 20 కోట్ల మొత్తాన్ని వెనక్కి రాబట్టాలంటే చిత్రం మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ సాధించి హిట్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే హక్కులు కొన్నవారు లాభాలు చూడగలరు. గోదావరి జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎక్కువ కావడంతో ధైర్యంగా డిస్ట్రిబ్యూటర్లు ఇంత ఎక్కువ మొత్తం చెల్లించారట. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు